
బాలీవుడ్ ను తన అంద చందాలతో షేక్ చేస్తున్న సన్ని లియోన్ గాలి ఇప్పుడు సౌత్ సినిమాలకు కూడా పాకింది. తెలుగులో ఇప్పటికే మంచు మనోజ్ కరెంటు తీగలో ఓ సాంగ్ చేసిన సన్ని రాజశేఖర్ హీరోగా చేస్తున్న గరుడవేగలో కూడా ఐటం సాంగ్ కు ఓకే చెప్పింది. అదే కాకుండా కృష్ణవంశీ డైరక్షన్ లో సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న నక్షత్రం సినిమాలో కూడా సన్ని లియోన్ తో ఐటం ప్లాన్ చేశారట.
సాయి ధరం తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా నక్షత్రంలో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. అయితే సన్ని లియోన్ కు డేట్స్ అడ్జెస్ట్ కాని క్రమంలో నక్షత్రం ఐటం సాంగ్ లో శ్రీయాను సెలెక్ట్ చేశారట. దర్శకుడిగా కాస్త గడ్డు కాలాన్ని అనుభవిస్తున్న కృష్ణవంశీ నక్షత్రంతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అదనపు ఆకర్షణగా శ్రీయా ఐటం సాంగ్ కూడా హిట్ ఫార్ములాలో భాగమే అని తెలుస్తుంది. మరి ఇంత చేసినా నక్షత్రం కృష్ణంవశీని నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.