
తెర మీద నవ మన్మధుడిగా నాగార్జున నవరసాలను పండిస్తుంటే తెరవెనుక అక్కినేని హీరోలు ఆ పరంపర కొనసాగిస్తున్నారు. అదెలా అంటే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్. కెరియర్ స్టార్టింగ్ లో నాగ్ సపోర్ట్ ఇచ్చినా లాభం లేకపోవడంతో పట్టించుకోవడం మానేశాడు. అక్కినేని హీరోల ఆడియో రిలీజ్ లకు వచ్చిన హంగామా చేయడం ఏదో రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ చేయడం సుమంత్ చేస్తున్న పని.
రిజల్ట్ ఎలా ఉన్నా సుమంత్ సినిమాలైతే చేస్తాడు చేస్తున్నాడు. కీర్తిరెడ్డితో ప్రేమ వివాహం చేసుకున్న సుమంత్ ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు సోలోగా ఉంటున్నాడు. ఇక ఈమధ్య ఓ ఫారిన్ బ్యూటీతో సహజీవనం చేస్తున్నాడని టాక్. ఎక్కడ కనిపించినా ఆమెతో తిరుగుతున్నాడట సుమంత్. రీసెంట్ గా సన్ రైజర్స్ మ్యాచ్ జరగడం అక్కడ కూడా సుమంత్ ఆమెతో కనబడటంతో సుమంత్ ఆమెతో ప్రేమలో ఉన్నట్టు కన్ఫాం చేశారు. ఇద్దరు కలిసే ఉంటున్నారని తెలుస్తుంది. మరి ఈ విషయం సుమంత్ బయట పెట్టాల్సిన అవసరం లేదనుకున్నాడో లేక ఎవరు గమనించట్లేదు అనుకున్నాడో కాని మొత్తానికి మనోడు మళ్లీ ఫారిన్ భామతో కలిసుంటున్నాడని తెలుస్తుంది.