
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో చేసిన రెండు సినిమాలకే పెద్ద క్రేజీ ప్రొడక్షన్ హౌజ్ గా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో సినిమాను నిర్మిస్తుంది. ఇక ఇదే కాకుండా మినిమం బడ్జెట్ సినిమాలను నిర్మించే ఆలోచనతో అక్కినేని హీరోతో సినిమా సిద్ధం చేస్తున్నారట.
చందు మొండేటి డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమం రీమేక్ తో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మొదటి హిట్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఇరువురు కలిసి కొత్త కథతో వస్తున్నారట. సినిమాలో నాగ చైతన్య క్యారక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరి మైత్రితో అక్కినేని హీరో మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.