రాజమౌళికి హ్యాట్సాఫ్.. మాటలు రావట్లేదు..!

బాహుబలి-2 సినిమా సూపర్ సక్సెస్ అవడమే కాదు చిత్రయూనిట్ ప్రముఖుల నుండి ఓ రేంజ్ ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మీద తమ అభిప్రాయాన్ని తెలుపగా ఇప్పుడు ఆ లిస్ట్ లో సూపర్ స్టార్ రజినికాంత్ కూడా చేరారు. 

బాహుబలి సినిమా చూసిన రజిని ఇండియన్ సినిమాకు గర్వకారణమని.. గాడ్స్ ఓన్ చైల్డ్ అయిన రాజమౌళికి అతని టీం కు హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేయడం విశేషం. ఇక ఇదే సినిమా మీద తన అభిప్రాయాన్ని తెలియచేశాడు శంకర్. బాహుబలి-2 సినిమా చూశా ఇది భారతీయ సినిమాకు గర్వకారణం అని.. ఎంత ధైర్యం, అందం, భారీతంతో వచ్చిన బాహుబలిని చూసి మాటలు రావట్లేదు. రాజమౌళి టీం కు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు శంకర్. ఇలా కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ శంకర్ అలానే సూపర్ స్టార్ రజినికాంత్ చేత శభాష్ అనిపించుకున్నాడు రాజమౌళి.