
'ఓం నమ శివాయ' సీరియల్ లో పార్వతి దేవి పాత్రలో మెప్పించిన సోనారిక బడోరియా.. జాదూగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో హీరో నాగ శౌర్యతో లిప్ లాక్ కానిచ్చిన సోనారిక రెండో సినిమా ఈడోరకం ఆడోరకం లో తన గ్లామర్ షోతో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. తర్వాత వచ్చిన స్పీడున్నోడు అంతగా ఆకట్టుకోకెపోయినా సోనారిక ఇప్పుడేం సినిమా చేస్తుంది అని ఆడియెన్స్ ఆరా తీస్తున్నారంటే కచ్చితంగా ఆమె సోయగాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారన్నట్టే.
ఇక ఛాన్స్ దొరికితే ప్రేక్షకుల మీద అందాల ప్రదర్శనను వెదజల్లే సోనారిక బికిని లుక్ తో బాప్రే అనిపించిన సందర్భాలున్నాయి. ఇక ఆమెను ఫాలో అవుతూ ఆమెను అభిమానిస్తూ వస్తున్న ఓ అభిమాని అమ్మడికి షాక్ ఇచ్చాడట. సోనారిక మీద ఉన్న అభిమానంతో ఎలాగోలా తన ఫోన్ నెంబర్ కనిపెట్టేసిన అతను అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టడం మొదలు పెట్టాడట. కొద్దిరోజులు లైట్ తీసుకున్న సోనారిక అతను మరి శృతిమించడంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసిందట.
అతను పనిపించిన మెసేజులు, ఫోటోలు పోలీసులు పరిశ్రీలించి అతన్ని అరెస్ట్ చేశారట. సోనారిక అందానికి ఫిదా అయిన అతను మరి ఏమని మెసేజులు పెట్టాడో కాని ఆమె మాత్రం అతన్ని జైలుకి పంపించి పెద్ద సీన్ చేసింది. వార్నింగ్ ఇచ్చినా మనోడు మాట వినలేదు అంటే ప్రభుద్ధుడు చాలా ఓవర్ చేశాడనే అనాలి. మరి విచారణ జరిపిన పోలీసులు అతగాడికి కౌన్సెలింగ్ ఇచ్చారో కోటింగ్ ఇచ్చి పంపారో కాని అతను చేసిన పనుల వల్ల అమ్మడు షాక్ అయ్యిందని తెలుస్తుంది.