బాహుబలి ఇంటర్వల్.. పవర్ స్టార్ రేంజ్ అది..!

ప్రస్తుతం ఎక్కడ విన్నా సరే బాహుబలి సినిమా అది వసూలు చేసే కలక్షన్స్ హవా గురించే మాట్లాడుతున్నారు. 100 కోట్లు దాటడం కష్టమేమో అనుకున్న తెలుగు సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమాలకే ఓ ల్యాండ్ మార్క్ మూవీగా అయ్యేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. విజయేంద్ర ప్రసాద్ కథ రాజమౌళి దర్శకత్వం ఇవి చాలదు ఓ సంచలనాల సినిమా తీసేందుకు. మొదటి పార్ట్ సూపర్ హిట్ ఊహించని రేంజ్ లో కలక్షన్స్ కూడా వచ్చాయి సెకండ్ పార్ట్ రెడీ చేస్తున్న క్రమంలో ఇంటర్వల్ బ్యాంగ్ ఎలా ఉండాలని తలలు బద్ధలయ్యేలా ఆలోచించారట విజయేంద్ర ప్రసాద్, రాజమౌళిలు. 

ఫైనల్ గా విజయేంద్ర ప్రసాద్ రాజ్య ప్రజలంతా 'బాహుబలి జయహో..' 'బాహుబలి జయహో..' అని గంభీరంగా అరిచే సన్నివేశం రాశాడట. ఆ సీన్ రాసేందుకు బలమైన కారణం పవర్ స్టార్ మేనియా అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పడం విశేషం. టివిలో పవన్ కళ్యాణ్ రాని ఫంక్షన్ లో కూడా ఆయన ఫ్యాన్స్ సినిమా హీరోని మాట్లాడకుండా పవర్ స్టార్ అని కేకలేయడం ఆయనకు స్పూర్తి కలిగించిందట. వెంటనే ఆ ఇంటర్వల్ సీన్ రాసేశాడట. సో అలా పవర్ స్టార్ రేంజ్ ఏంటో బాహుబలి-2 ఇంటర్వల్ సీన్ తెలియచేసిందన్నమాట.   

ఏది ఎలా ఉన్నా రాజమౌళి మార్క్ తో వచ్చిన బాహుబలి-2 అందరి అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆ సినిమా కలక్షన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. కచ్చితంగా టాప్ ప్లేస్ లో వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. మరి బాహుబలి-2 అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.