
బాహుబలి మేనియాలో హాలీవుడ్ సినిమాలు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. యూఎస్ లాస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్ లో ది సర్కిల్ సినిమాను నెట్టేసి బాహుబలి ముందు స్థానంలో ఉండగా.. 'హౌ టూ బి ఎ లాటిన్ లవర్' ను 'ది ఫేట్ ఆఫ్ ద ఫ్యూరియస్' సినిమా దాటేసింది. ఈవారం బాక్సాఫీస్ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీస్ లిస్ట్ లో బాహుబలి 3వ స్థానంలో ఉంది.
రిలీజ్ అయిన అన్ని చోట్ల బీభత్సమైన కలక్షన్స్ సాధిస్తున్న బాహుబలి ఓవర్సీస్ లో మొదటి వారాంతరంలోనే 10 మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసింది. కేవలం 450 థియేటర్లలో రిలీజ్ అయ్యి యూఎస్ లో ఈ రేంజ్ లో వసూళ్లు సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో భారీగా కలెక్ట్ చేసిన సినిమాల గురించి ప్రస్తావిస్తే బాహుబలి-1 ఫుల్ రన్ లో 7.51 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే కేవలం ఒక్క వారంలోనే 10 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది బాహుబలి-2.
ఇక బాహుబలి తర్వాత శ్రీమంతుడు 2.89 మిలియన్ డాలర్స్, అఆ 2.45 మిలియన్ డాలర్స్, ఖైది నంబర్ 150 2.45 మిలియన్ డాలర్స్, నాన్నకు ప్రేమతో 2.02 మిలియన్ డాలర్స్, అత్తారింటికి దారేది 1.90 మిలియన్ డాలర్స్, జనతా గ్యారేజ్ 1.80 మిలియన్ డాలర్స్, గౌతమిపుత్ర శాతకర్ణి 1.66 మిలియన్ డాలర్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.64 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ సాధించాయి. ఓవర్సీస్ లో భారీ కలక్షన్స్ రాబట్టిన సినిమాల్లో టాప్ టెన్ లో ఈ సినిమాలు ఉన్నాయి.