
ఓ పక్క సూపర్ హిట్ సినిమాలతో విపరీతమైన ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో పక్క వాణిజ్య ప్రకటనలలో కూడా తన వీర ప్రతాపం చూపిస్తున్నాడు. టాలీవుడ్ లో హ్యాట్రిక్ 50 కోట్ల కలక్షన్స్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బన్ని యాడ్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు. ఓరకంగా టాలీవుడ్ యాడ్ సెప్షలిస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ ముందుండగా ఆ తర్వాత స్థానంలో బన్ని ఉన్నాడు.
లేటెస్ట్ గా బన్ని రెడ్ బస్ యాడ్ లో కనబడ్డాడు. రాజు కావాలంటే రెడ్ బస్ యాప్ తో టికెట్ బుక్ చేసుకోవాలంటూ వచ్చిన ఈ యాడ్ ప్రేక్షకులను అలరిస్తుంది. స్టైలిష్ స్టార్ క్రేజ్ కు తగ్గట్టుగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు బన్ని. ఓ పక్క అబి బస్ తో మహేష్ అదరగొడుతుండగా మహేష్ కు పోటీగా రెడ్ బస్ కు అల్లు అర్జున్ ను పెట్టారు. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హిందిలో వస్తున్న ఈ యాడ్ త్వరలో తెలుగులో రాబోతుంది.