
బాహుబలి-2 మీద తనదైన స్పందన తెలియచేశాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. రాజమౌళి లాంటి డైమండ్ ను కనుక్కున్న కరణ్ జోహార్ కు తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఇక బాహుబలిని మెగా డైనొసర్ తో పోల్చుతూ రాజమౌళి ఖాన్, రోషన్, చోప్రాల కంటే పెద్ద దర్శకుడని అన్నారు. రాజమౌళిని కనిపెట్టిందుకు కరణ్ జోహార్ పాదాలను ఇండియన్ సినిమా ప్రేక్షకులు తాకాలని ట్వీట్ చేశాడు.
అంతేకాదు ప్రపంచం మొత్తం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లా ఎలా నిర్ణయించబడిందో.. ఇండియన్ సినిమా కూడా బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి గా డిసైడ్ చేయొచ్చని అన్నారు వర్మ. ప్రతి ఒక్క సూపర్ హీరో, సూపర్ డైరక్టర్ బాహుబలికి రకరకాల ప్లేసుల నుండి వస్తున్న రిపోర్ట్ చూసి వణుకు పుట్టడం ఖాయమని ట్వీట్ చేశాడు వర్మ. రాజమౌళి గురించి బాహుబలి గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ తన మార్క్ సెన్సేషనల్ కామెంట్స్ తో మళ్లీ హాట్ న్యూస్ గా మారాయి.