ఇక్కడ రత్తాలు అక్కడ అరేబియన్ గుర్రం..!

ముందు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా సరైన అవకాశాలను అందుకోలేదు లక్ష్మి రాయ్.. అదేనండి రాయ్ లక్ష్మి. ఇక తెలుగులో అసలు కనిపించని ఈ భామ కోలీవుడ్ బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తోబ తోబ సాంగ్ చేసింది. ఆ సాంగ్ మెగాస్టార్ తో ఖైది నంబర్ 150లో చేసే అవకాశం తెచ్చింది. ఇక మెగాస్టార్ పక్క రత్తాలుగా తన అందాలతో మత్తు చల్లిన రాయ్ లక్ష్మి తెలుగులో స్పెషల్ సాంగ్స్ కు సూపర్ అనిపించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో జూలి-2 లో నటిస్తున్న అమ్మడు ఎలాంటి అడ్డుగోడలు లేకుండా నటించేస్తుందట. ఇంటిమేట్ సీన్స్ లో అమ్మడి కోపరేషన్ చూసి యూనిట్ సభ్యులే షాక్ అవుతున్నారట. జూలి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మి తన అందాలనే పెట్టు బడిగా పెడుతుందట. ఇక సినిమాపై వస్తున్న ఈ పాజిటివ్ టాక్ చూసి అంచనాలు పెరిగాయి. అంతేకాదు బీ టౌన్ ఆడియెన్స్ రాయ్ లక్ష్మిని అరేబియన్ గుర్రం అనేస్తున్నారు.

సౌత్ లో తన మార్క్ చూపించకపోయినా బాలీవుడ్ ఎంట్రీ తో అక్కడ బ్లాస్ట్ అవుతున్న రాయ్ లక్ష్మి బాంబ్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో మరి. ఆ సినిమా అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకుంటున్న రాయ్ లక్ష్మి అక్కడ  స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.