యూట్యూబ్ లో రకుల్ రచ్చ..!

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉన్నప్పుడు సరిగ్గా ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ ప్రేక్షకులకు బాగా నచ్చింది. యువ హీరోల దగ్గర నుండి ఇప్పుడు స్టార్ హీరోలకు మొదటి ఆప్షన్ గా మారిన రకుల్ రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ధ్రువ సినిమాలో తన అందాలకు పని చెప్పింది. సినిమాలో ముఖ్యంగా పరెశానురా సాంగ్ కుర్ర కారుకి మాంచి కిక్ ఇచ్చింది. సినిమాలో ఈ సాంగ్ సూపర్ హిట్.. అయితే ఈ సాంగ్ ఎప్పుడు అఫిషియల్ వీడియో రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు.  

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ధ్రువ పరెశానురా వీడియో సాంగ్ యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది. ఓ హీరోయిన్ సాంగ్ కు ఈ రేంజ్ ఫాలోయింగ్ అది తెలుగులో అంటే రకుల్ రేంజ్ ఏంటో అర్ధమవుతుంది. స్టార్స్ అవకాశాలను అందుకుంటూనే తన సోయగాలతో ప్రేక్షక హృదయాలను గాయపరుస్తున్న ఈ అమ్మడు స్కిన్ షోతో అదరగొట్టేస్తుంది. పరేశానురా సాంగ్ రకుల్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. అందుకే ఈ సాంగ్ యూట్యూబ్ లో స్టార్ హీరో సినిమా టీజర్ లా వ్యూయర్ కౌంట్ గంట గంటకు పెరుగుతుంది. ఈ వ్యూయర్ షిప్ చూస్తే చాలు రకుల్ ఎంతమంది మనసు గెలుచుకుందో తెలుసుకోడానికి. అమ్మడి ఊపు చూస్తుంటే ఇప్పుడప్పుడే క్రేజ్ తగ్గేలా లేదనిపిస్తుంది. ప్రస్తుతం రకుల్ మహేష్ మురుగదాస్ సినిమాలో నటిస్తుండగా తేజ్ విన్నర్ లో కూడా జతకట్టింది.