వావ్ బన్ని టైటిల్ అదిరిపోయింది..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాకు డువ్వాడ జగన్నాథం అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే టైటిల్ ఎనౌన్స్ చేసే గట్స్ కేవలం బన్నికే ఉన్నాయని చెప్పాల్సిందే. ప్రస్తుతం డిజె షూటింగ్ జరుపుకుంటుండగా ఇక తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. డిజె తర్వాత కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లింగుస్వామితో పాటుగా రైటర్ వక్కంతం వంశీతో కూడా సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్.

లింగుస్వామి సినిమా వంశీ సినిమా రెండు ఒకేసారి షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. అందుకే వంశీ కథని ఫైనల్ చేసి దానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అని పెట్టబోతున్నారట. లగడపాటి శ్రీధర్ ఇప్పటిదాకా లో బడ్జెట్ సినిమాలే తీశాడు కెరియర్ లో నిర్మాతగా మొదటిసారి బన్ని లాంటి స్టార్ హీరోతో చేస్తున్నాడు. తన బ్యానర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించగా ఇది కచ్చితంగా అల్లు అర్జున్ సినిమా కోసమే అని ఫిక్స్ అవుతున్నారు. మరి వక్కంతం వంశీ టైటిల్ అయితే పవర్ ఫుల్ గానే పెట్టుకున్నాడు సినిమా ఎలా తీస్తాడో చూడాలి.