బాలయ్య కూడా పెంచేశాడండి..!

నందమూరి బాలకృష్ణ నటించిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ అందుకోవడంతో బాలయ్య మంచి జోష్ కనబరుస్తున్నారు. ఇలాంటి సినిమాలు కేవలం బాలకృష్ణ వల్లే సాధ్యం అన్నట్టు తన సత్తా చాటి చెప్పిన బాలయ్య తన రెమ్యునరేషన్ కూడా పెంచాడని అంటున్నారు. మొన్నటిదాకా సినిమాకు 7 కోట్ల దాకా తీసుకున్న బాలకృష్ణ శాతకర్ణి సక్సెస్ తో కాస్త పెంచాడని తెలుస్తుంది.

ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలయ్యతో సినిమా తీయాలంటే కనీసం పది కోట్లు ఇవ్వాల్సిందే అట. అంటే ఓ ఏరియా డిస్ట్రిబ్యూషన్ వాల్యూ తన రెమ్యునరేషన్ గా ఫిక్స్ చేశాడన్నమాట. ప్రస్తుతం యువ హీరోలతో పాటుగా సీనియర్ స్టార్ హీరోలు కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సంక్రాంతికి ఖైది నంబర్ 150గా చిరంజీవి, శాతకర్ణిగా బాలయ్య సత్తా చాటగా రీసెంట్ గా వచ్చిన నమో వెంకటేశాయతో నాగార్జున కూడా తన మార్క్ హిట్ అందుకున్నారు. మరి వీరిలో ప్రస్తుతం వెంకటేష్ ఒక్కడే కాస్త వెనుకపడ్డాడని చెప్పొచ్చు.