వినాయక్ తర్వాత ఎవరితో..?

అఖిల్ సినిమా అపజయం భాధ్యతను నెత్తిన వేసుకుని ఖైది సినిమా చేసిన వినాయక్ ఆ సినిమా సక్సెస్ తో సూపర్ డైరక్టర్ గా మళ్లీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తన తర్వాత సినిమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు వినాయక్. అసలైతే వినాయక్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేయాల్సింది. కాని ప్రస్తుతం బాబి డైరక్షన్ లో సినిమా చేస్తున్న తారక్ ఆ తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకే వినాయక్ చూపు మెగా మేనళ్లుడు సాయ్ ధరం తేజ్ మీద పడ్డది.. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో విన్నర్ గా ఈ శివరాత్రి నాడు రానున్న తేజ్ ఈమధ్యనే బివిఎస్ రవితో జవాన్ సినిమా స్టార్ చేశాడు. ఇక వినాయక్ తో సినిమాకు కూడా చర్చలు నడుస్తున్నాయట. సాయి ధరం తేజ్ అది ఓకే చేస్తే కనుక స్టార్ లీగ్ లోకి వచ్చేసినట్టే. మెగా మేనరిజాలతో ఇప్పటిదాకా ఓ మోస్తారు డైరక్టర్స్ తోనే సినిమాలు తీసి హిట్ అందుకున్న సాయి ధరం తేజ్.. వినాయక్ తో సినిమా చేస్తే కనుక ఇక తిరుగుండదని చెప్పొచ్చు. మరి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం విన్నర్ సినిమా నిర్మిస్తున్న నల్లమలపు శ్రీనివాస్ నిర్మాణంలోనే సాయి ధరం తేజ్ వినాయక్ సినిమా కూడా వస్తుందని తెలుస్తుంది.