ముహుర్తం రోజే రిలీజ్ డేట్ లాక్ చేసిన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరక్షన్ లో రాబోతున్న సినిమాకు ఈరోజు ముహుర్తం పెట్టారు. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా పర్ఫెక్ట్ షెడ్యూల్ లో పూర్తి చేసి ఆగష్టు 11న రిలీజ్ ప్లాన్ చేయాలని నిర్ణయించారట చిత్రయూనిట్. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు జై లవ కుశ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

ముహుర్తం సన్నివేశానికి వివివినాయక్ దర్శకత్వం వహించగా తన సినిమాకు తానే క్లాప్ కొట్టారు ఎన్.టి.ఆర్. జనతా గ్యారేజ్ హిట్ తో మళ్లీ ట్రాక్ ఎక్కేసిన జూనియర్ బాబి సినిమా కోసం ముందు నుండి కసరత్తులు చేస్తున్నాడు. పక్కా ప్లానింగ్ తో మళ్లీ గ్యారేజ్ హిట్ ను మించి హిట్ సాధించాలని ఈ సినిమా అంతా పకడ్బందీగా చేస్తున్నారట. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఆగష్టు 11 రిలీజ్ అని ఎనౌన్స్ చేశారంటే ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నారో అర్ధమవుతుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు. తారక్ తో ఈ ఇద్దరు హీరోయిన్స్ పనిచేయడం ఇదే మొదటిసారి. నివేదా థామస్ అయితే నాని జెంటిల్ మన్ తర్వాత నానితోనే ఓ సినిమా చేస్తుండగా మూడో సినిమాకే తరక్ తో జత కట్టే ఛాన్స్ పట్టేసింది.