అనసూయ టాప్ లేపేసిందిగా..!

హాట్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన అందాల విందు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొదటి సినిమా సోగ్గాడే చిన్ని నాయనాలో నాగ్ మరదలిగా నటించిన అమ్మడు క్షణంలో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. ఇక ప్రస్తుతం మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుంది అనసూయ. ఈ సాంగ్ కు మరో స్పెషల్ ఏంటంటే యాంకర్ సుమ ఈ పాట పాడటం.. సూయ సూయ అనసూయ అంటూ వచ్చే ఈ సాంగ్లో అనసూయ రెచ్చిపోయిందట.

నిన్న రిలీజ్ చేసిన ఈ సాంగ్ పిక్స్ లో అనసూయ హాట్ హాట్ గా కనిపించింది. స్మాల్ స్క్రీన్ మీద తనకున్న ఇమేజ్ ను రోజు రోజుకి పెంచుకుంటూ వస్తుంది ఈ అమ్మడు. అటు బుల్లితెర మీదే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తెగ రెచ్చిపోతుంది. ఏమాత్రం అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శన చేస్తున్న అమ్మడు చూస్తుంటే ఈ హాట్ ఐటం తో స్టార్ రేంజ్ కు వెళ్లేలా ఉంది. ఇప్పటికే ఓ పక్క హీరోయిన్స్ గా చేస్తూనే స్టార్ హీరోయిన్స్ ఐటం సాంగ్స్ లో కనిపిస్తున్నారు. మరి కాస్త రిలాక్స్ ఇచ్చి అనసూయ ను హాట్ ఐటం గా అందరు వాడేస్తారేమో చూడాలి.