
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమాలో అవకాశం వస్తే అది ఎవరైన చేజార్చుకోవడానికి ఇష్టపడరు కాని కోలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుథ్ మాత్రం ఒకసారి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అఆ సినిమాకు ముందు అనిరుథ్ తోనే మ్యూజిక్ చేయించాలని ప్లాన్ చేసుకున్నా అది ఎందుకో కుదరలేదు. ఇక ప్రస్తుతం త్రివిక్రం పవన్ కళ్యాణ్ తో చేసే సినిమాకు మాత్రం అనిరుథ్ పక్కా అనుకున్నారు కాని ఈసారి కూడా అనిరుథ్ త్రివిక్రం సినిమాకు పనిచేయడం కష్టమని అంటున్నారు.
కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉండే అనిరుథ్ తెలుగు సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. తనతో మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకోవాలంటే తను చెప్పిన డేట్స్ కే అరేంజ్ చేసుకోవాలని. కాని జనవరిలో అనిరుథ్ ఇచ్చిన డేట్స్ కాదనేశాడట త్రివిక్రం. పవన్ ఇప్పుడు ఖాళీ అవలేదు కాబట్టి అప్పుడే మ్యూజిక్ ఎందుకని ఆపేశారట. అయితే తనకిచ్చిన డేట్స్ లో తను రెడీగా ఉన్నా ఈసారి త్రివిక్రం అడ్డుచెప్పడంతో మళ్లీ అసలు ఈ సినిమాకు అనిరుథ్ పనిచేస్తాడా లేదా అన్న డౌట్ రేజ్ అవుతుంది. స్క్రిప్ట్ పనులన్ని పూర్తి చేసుకుని రెడీగా ఉన్న త్రివిక్రం పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి పవర్ స్టార్ ఎప్పుడు సినిమాను సెట్స్ మీదకు వెళ్లేలా చేస్తాడో చూడాలి. అప్పటిదాకా మ్యూజిక్ విషయంలో క్లారిటీ రానట్టే లెక్క.