
తమిళ నటుడే అయినా సరే తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు కార్తి. ప్రస్తుతం కార్తి నటిస్తున్న సినిమా చెలియా. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కొత్త కార్తిని చూస్తారని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ అదితి రావు హైదరితో ఫుల్ రొమాన్స్ చేశాడట కార్తి. కార్తి సినిమాల్లో ఈ రేంజ్ రొమాన్స్ ఏ సినిమాలో ఉండదట. అసలు ఇంతవరకు మనోడు ఆ యాంగిల్ ట్రై చేయలేదు.
సినిమాలో కార్తి లుక్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి దాకా పక్కింటి అబ్బాయిలా మంచి ఇమేజ్ సంపాదించిన కార్తి ఇక నుండి రొమాంటిక్ హీరో కూడా అనిపించుకోనున్నాడు. హీరోయిన్ అదితితో చెలియా సినిమాలో లెక్కకు మించి లిప్ లాక్ సీన్స్ ఉన్నాయట. కార్తిలో ఈ కొత్త యాంగిల్ ఎలా ఉంటుందో మరి. తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న కార్తి తన గురువు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.