
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ సినిమా చేస్తారని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న హాట్ టాక్. టి.సుబ్బిరామిరెడ్డి ఈ ఇద్దరి చేత సినిమా తీసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమాను త్రివిక్రం డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ ఎంత ఏంటి అన్నది తెలియదు కాని సినిమాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల రెమ్యునరేషన్ మాత్రం షాక్ కలిగిస్తుంది.
కేవలం ఆ ఇద్దరి రెమ్యునరేషనే 50 కోట్లట. అంటే చిరు 25 కోట్లు, పవన్ కు 25 కోట్లు ఇస్తున్నారట. ఇక డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ కు 15 కోట్లట అంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కాకుండా కేవలం రెమ్యునరేషనే 65 కోట్లన్నమాట. హీరోయిన్ మిగతా ఆర్టిస్ట్ అన్ని కలిపితే ఇదో 100 కోట్ల బడ్జెట్ సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఖైదితో మళ్లీ ఫాంలోకి వచ్చిన మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఇప్పుడు అందరిలో చర్చ మొదలైంది. బడ్జెట్ ఈ రేంజ్లో ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో చూడాలి.
చిరు పవన్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమా కచ్చితంగ సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాతో ప్రస్తుతం దూరంగా ఉన్న అన్నదమ్ములిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. సినిమ గురించి మిగతా విషయాలు త్వరలో వెళ్లడవుతాయి.