ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ టెక్నిషియన్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబు డైరక్షన్ లో మూవీకి హాలీవుడ్ టెక్నిషియన్ పనిచేస్తున్నాడని తెలిసింది. ప్రొస్థెటిక్ మేకప్ లో అందవేసిన చెయ్యి సాధించిన వాన్స్ హార్ట్ వెల్ జూనియర్ సినిమాకు పనిచేయబోతున్నాడట. లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై సినిమాలో ప్రోస్థెటిక్ లెగసి ఎఫెక్స్ అందించిన వాన్స్ తారక్ సినిమాకు పనిచేయడం గొప్ప విషయం. 

ఇప్పటికే సినిమాకు పనిచేసేందుకు వాన్స్ హైదరాబాద్ చేరుకున్నాడు. తారక్ తో దిగిన పిక్ రివీల్ చేసి విషయం డిక్లేర్ చేశారు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు. సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి హాలీవుడ్ టెక్నిషియన్ ను వాడుతున్నారు అంటే సినిమాలో తారక్ కొత్త గెటప్ లో కనిపిస్తాడని చెప్పేయొచ్చు. ఈ టెక్నిషియన్ ఎంట్రీతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు.