
మెగా ఎంట్రీతో బాక్సాఫీస్ షేక్ చేసిన మెగాస్టార్ తను నటించిన ఖైది నంబర్ 150 సినిమాతో ఎలాంటి కలక్షన్స్ సాధించాడో తెలిసిందే. సినిమాతోనే కాదు పదేళ్ల తర్వాత కొత్తగా బుల్లితెర మీద కూడా ఎంట్రీకి సిద్ధమయ్యాడట. మాటివిలో మీలో ఎవరు కోటిశ్వరుడుతో ప్రభంజనం సృష్టించిన నాగార్జున మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. ఇక రాబోతున్న నాలుగో సీజన్లో మెగాస్టార్ హాట్ సీట్ లో కూర్చోబోతున్నాడు. కంటెస్టంట్ గా కాదు హోస్ట్ గా.. ఓ పక్క ఖైది సినిమా చేస్తూనే ఎం.ఈ.కె షూటింగ్ లో కూడా పాల్గొన్న చిరంజీవి స్మాల్ స్క్రీన్ పై త్వరలో రాబోతున్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 13 నుండి షో స్టార్ అవబోతుందట. స్మాల్ స్క్రీన్ పై నాగార్జున అనగానే మొదట ఎలా ఉంటాడో అన్న ఎక్సయిటింగ్ కలిగింది. కాని వచ్చి ఎం.ఈ.కెకు సూపర్ క్రేజ్ తెచ్చాడు నాగ్. ఇక ఇప్పుడు మెగాస్టార్ వంతు అయ్యింది. మెగాస్టార్ ఫేవరిజంతో ఈ షో ఎలా ఉండబోతుందో చూడాలి. చిరు హోస్ట్ గా రాబొతున్న మీలో ఎవరు కోటిశ్వరుడు ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.