నాని ఖాతాలో మరో హిట్..!

నాచురల్ స్టార్ నాని ఫాంను చూస్తే ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా షివరింగ్ అంటే నమ్మాల్సిందే. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తన హిట్ సినిమా ప్రస్థానం మొదలు పెట్టిన నాని నిన్న రిలీజ్ అయిన నేను లోకల్ సినిమాతో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన నేను లోకల్ మూవీ మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  

నానికి జంటగా కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాలో నానితో సరిసమానంగా నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇక సినిమాకు దేవి మ్యూజిక్ కూడా మరో లెవల్ కు చేర్చింది. ప్రేమకథ నాని లాంటి హీరో.. నవరసాలతో కూడిన కథనం.. అందుకే సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. నాని సినిమాల్లో మొదటి రోజు హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించిన ఈగ సినిమాకు దగ్గరగా నేను లోకల్ మూవీ మొదటి రోజు కలక్షన్స్ ఉన్నాయంటే సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇదే జోష్ తో నాని ఇలాంటి హిట్ సినిమాలనే తీయాలని ఆశిద్దాం.