యాదాద్రి కథ తెరకెక్కిస్తా : రాఘవేంద్రరావు

కేవలం కమర్షి యల్ చిత్రలతోనే కాదు భక్తి రస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యగల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. అయితే భక్తిరస చిత్రాలు తీయడంలో తనకి తానే సాటి అనిపించుకున్నారు. ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాఘవేంద్ర రావు సినిమాలో అన్ని హంగులు ఉండేలా చూసుకున్నారు.   

 సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతుండగా ఈ సందర్భం గా యాదాద్రిలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి మంచి పుణ్య క్షేత్రమని లక్ష్మినరసింహ స్వామి చరిత్రను కూడా పూర్తిగా తెలుసుకొని ఈ ప్రాంత మహత్యం ని తెరమీద ఆవిష్కరించాలని ఉందని అన్నారు. నమో వెంకటేశాయ హిట్ అయితే నాగార్జునతోనే ఆ సినిమా కూడా లైన్ చేస్తారేమో చూడాలి. సినిమా ఆడియో రిలీజ్ నాడు రాఘవేంద్ర రావు ఆఖరి సినిమా ఇదే అని నాగార్జున ప్రస్తావించారు. యాదాద్రి కథ తెరకెక్కించాలని దర్శకేంద్రుడి ఆలోచన చూస్తే అది నిజం కాదని తెలుస్తుంది.