
సూపర్ స్టార్ మహేష్ బాబుకి మెగా హీరో సాయి ధరం తేజ్ థాంక్స్ చెప్పాడు. మెగా మేనళ్లుడు నటిస్తున్న విన్నర్ సినిమా ఫస్ట్ సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ నిన్న సాయంత్రం ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. మహేష్ తన సినిమా పాట రిలీజ్ చేసినందుకు తేజ్ థాంక్స్ చెప్పాడు. అంతేకాదు మీ సపోర్ట్ బ్లెసింగ్స్ తమ టీంకు చాలా ప్రత్యేకమని ట్వీట్ చేశాడు.
మెగా హీరోల్లో సాయి ధరం తేజ్ అందరి హీరోలతోనూ క్లోజ్ గా ఉంటున్నాడు. రీసెంట్ గా తన కొత్త సినిమా జవాన్ లాంచింగ్ లో తారక్ తో కలిసి ముచ్చటించిన తేజ్ ఇప్పుడు తన సినిమా పాట రిలీజ్ చేసినందుకు సూపర్ స్టార్ మహేష్ కు తన తరపున థాంక్స్ చెప్పాడు. ఓ పక్క తన సినిమాలతో హిట్ అందుకోవడమే కాదు తోటి స్టార్స్ తో కలివిడిగా ఉంటూ మెగా మేనళ్లుడు సత్తా చాటుతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.