పవర్ స్టార్ కు రకుల్ షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అయితే ఆ ఛాన్స్ వచ్చినా సరే క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మిస్ చేసుకుంది. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ ఆ తర్వాత వరుసగా త్రివిక్రం, తమిళ దర్శకుడు నీశన్ డైరక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. 

టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో వరుసగా అవకాశాలను అందుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మహేష్ మురుగదాస్ సినిమాతో పాటుగా సాయి ధరం తేజ్ విన్నర్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇవే కాకుండా ఆల్రెడీ కమిటైన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే పవన్ ఆఫర్ ను కాదనేసింది.. డేట్స్ అడ్జెస్ట్ కాకనే అమ్మడు ఈ ఆఫర్ మిస్ చేసుకుంది. మరి పవర్ స్టార్ తో సినిమా ఆఫర్ మిస్ అయినందుకు ఆమె ఎంత భాధపడుతుందో ఏమో.