
అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ తీసి సంవత్సరం దాటి ఆరునెలలు అవుతున్నా ఇంకా తన సెకండ్ మూవీని స్టార్ట్ చేయలేదు. విక్రం కె కుమార్ తో సినిమా కమిట్ అయిన అఖిల్ ఆ సినిమాను జనవరి మొదటి వారంలో స్టార్ట్ చేస్తారని హడావిడి చేశారు. తీరా చూస్తే అది కూడా వాయిదా పడింది. ఇంతకీ అఖిల్ సినిమా ఉందా లేదా అంటే విక్రం కుమార్ తో సినిమా లేట్ అవడానికి కారణం ఆ సినిమా కథ అని తెలిసింది.
అఖిల్ కోసం విక్రం ఓ కథ చెప్పాడట అది ఫస్ట్ హాఫ్ ఓకే బట్ సెకండ్ హాఫ్ నచ్చలేదట. అయినా సరే సినిమా తీద్దామనుకుని ఫిక్స్ చేశారట. అయితే ఈలోగా మరో మంచి కథ ఉంటే విక్రంను చెప్పమనగా మరో అద్భుతమైన కథ చెప్పాడట. మొదట చెప్పింది వదిలేసి రెండో సారి చెప్పిన కథ ఫైనల్ చేశారట. అందుకే అఖిల్ సినిమా లేట్ అవుతుందని అంటున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆడియెన్స్ మైండ్ సెట్ కు తగినట్టు లేకపోతే మళ్లీ అఖిల్ తన మొదటి సినిమా ఫలితాన్నే అందుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలను గుర్తుంచుకుంటే మంచింది.