పవన్ సీన్ తో బన్ని..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు కాని బన్ని చెప్పను బ్రదర్ అన్న దగ్గర నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం బన్ని దూరమయ్యాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న బన్ని ఆ సినిమాలో బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అదుర్స్ లో ఎన్.టి.ఆర్ చారి గెటప్ ను పోలి డిజెలో బన్ని పాత్ర ఉంటుందని అంటున్నారు.

ఇక అదే కాకుండా గబ్బర్ సింగ్ లో సూపర్ హిట్ అయిన అంత్యాక్షరి సీన్ ను కూడా మళ్లీ డిజెలో పెట్టబోతున్నారట. ఆ సీన్ అంటే అలాంటి అంత్యాక్షరి ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేశాడట హరీష్ శంకర్.. బన్ని కూడా ఓకే చెప్పడంతో సినిమాలో ఆ సీన్ పెట్టబోతున్నారట. మరి పవన్ ను వ్యతిరేకించే ఉద్దేశం ఉంటే కచ్చితంగా బన్ని ఈ సీన్ చేయడానికి ఒప్పుకోడు. అలా కాకుండా అంత్యాక్షరి సన్నివేశం ఓకే చెప్పాడంటే పవన్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పినట్టే అవుతుంది.