తేజ్ ప్లాన్ అదుర్స్..!

మెగా హీరోల్లో సాయి ధరం తేజ్ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు. మెగా క్యాంప్ హీరోనే అయినా మిగతా హీరోలతో ఎంతో క్లోజ్ గా ఉంటూ తన మంచి తననాన్ని చాటుకుంటున్నాడు. మెగాస్టార్ ఖైది నంబర్ 150తో పాటుగా రిలీజ్ అయిన బాలకృష్ణ శాతకర్ణికి విష్ చేసిన తేజ్ రీసెంట్ గా మంచు మనోజ్ ఆడియోకి గెస్ట్ గా వెళ్లాడు. అంతేకాదు సాయి ధరం తేజ్ బివిఎస్ రవి కాంబినేషన్ లో వస్తున్న జవాన్ సినిమాకు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ క్లాప్ కొట్టడం జరిగింది. 

ఇక తాజాగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్న విన్నర్ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ చేత రిలీజ్ చేయిస్తున్నారు. కేవలం మెగా బ్రాండ్ తోనే కాకుండా మిగతా హీరోలతో కూడా సాయి ధరం తేజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. మెగాస్టార్ కూడా అంతే తాను నంబర్ 1 పొజిషన్ లో ఉన్నా అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని సహృదయంతో మందలించేవారు. మెగా మేనళ్లుడు కూడా అదే పంథాలో భారీ స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది.