
యువ హీరో నాగ శౌర్య మీద హాట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో సంచరిస్తుంది. లాస్ట్ ఇయర్ కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద సినిమాలతో హిట్స్ అందుకున్న నాగ శౌర్య ప్రస్తుతం ఏ సినిమా చేయట్లేదు. దీనికి కారణం ఓ నిర్మాత దగ్గర అడ్వాన్స్ గా కొంతమొత్తంగా తీసుకుని అతనితో సినిమా అంటే కథ కాకరకాయ నచ్చలేదు అంటూ కబుర్లు చెబుతున్నాడట. ఇక సహనం నశించిన నిర్మాత తన డబ్బులు రిటర్న్ అడుగగా అప్పటి నుండి ఆ నిర్మాత ఫోన్ కు కూడా అందుబాటులో ఉండట్లేదట నాగశౌర్య.
మరి కెరియర్ మొదట్లోనే ఇలాంటి విషయాల్లో అపవదాలు మూటకట్టుకుంటున్న నాగశౌర్య ఫ్యూచర్ లో ప్రాబ్లెమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాదు సదరు నిర్మాత ఈ విషయాన్ని మిగతా నిర్మాతలకు కూడా స్ప్రెడ్ చేస్తున్నాడట. ఇదో రకంగా నాగశౌర్యకి బ్యాడ్ నేం తీసుకొస్తుందని చెప్పొచ్చు. హిట్ కొట్టినా మనోడు సినిమా తీయకపోవడం ఆశ్చర్యంగా మారింది. అయితే సొంతంగా ఓ నిర్మాణ సంస్థ పెట్టే ఆలోచనలో నాగశౌర్య ఆ నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది.