శర్వా అనుపమ సంథింగ్ సంథింగ్..!

ఓ సినిమాలో హీరో హీరోయిన్ కాస్త క్లోజ్ గా కనిపించారంటే చాలు వారి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ రచ్చ చేయడం మాములే. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కామనే అయినా అదే పనిగా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆ సాన్నిహిత్యం కనబడితే కచ్చితంగా వరి మధ్య లింక్ పెట్టేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తాజా హిట్ కొట్టిన ఓ జంట మీద ఇలాంటి గాసిప్పులే వస్తున్నాయి. ఇంతకీ ఎవరా జంట అంటే శతమానం భవతి హీరో హీరోయిన్ శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్.

మలయాళ ప్రేమంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ తర్వాత తెలుగులో కూడా అదే రేంజ్ అవకాశాలను అందుకుంది. అఆ, ప్రేమం తర్వాత శతమానం భవతితో సోలో హిట్ అందుకుంది అనుపమ. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో అనుపమతో శర్వా క్లోజ్ నెస్ పెరిగిందట. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇద్దరు క్లోజ్ గా ఉండటం చూసి వీరిద్దరు ఆఫ్ స్క్రీన్ రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు డిక్లేర్ చేస్తున్నారు. 

శర్వానంద్ చాలా సింపుల్ గా ఉండే హీరో.. ఇన్ని సినిమాలు తీసినా శర్వా మీద ఎలాంటి రూమర్ రాలేదు. కాని ఇప్పుడు వస్తున్న ఈ గాసిప్పు మాత్రం నమ్మేలా చేస్తుంది. మరి ఇద్దరి వ్యవహారం ఎందాకా వెళ్తుందో చూడాలి.