ఈసారి మెగాస్టార్ టార్గెట్ బాహుబలినే..!

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత వచ్చిన ఖైది నంబర్ 150 మూవీ ఎలాంటి అంచనాలతో వచ్చిందో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అందించింది. అయితే ఈ సినిమా చాలా చోట్ల బాహుబలి రికార్డులను కూడా తిరగరాసింది. ఉత్తరాంధ్రలో బాహుబలిని క్రాస్ చేసే కలక్షన్స్ తో హుశారెత్తించిన ఖైది నంబర్ 150 ఇప్పుడు రాబోతున్న సినిమాతో బాహుబలి టోటల్ రికార్డుల మీద కన్నేశాడట.

రాజమౌళి సృష్టించిన అద్భుతం బాహుబలి.. బిగినింగ్ తోనే తెలుగు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో కలక్షన్స్ సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు కొనసాగింపుగా పార్ట్-2 ఏప్రిల్ లో రాబోతుంది. మెగాస్టార్ 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అనుకుంటున్నారు. ఈ సినిమాతో బాహుబలి టోటల్ రికార్డులను టార్గెట్ చేశాడట చిరంజీవి. ఓ రీమేక్ సినిమాతోనే ఈ రేంజ్ కలక్షన్స్ రాబట్టగా బయోపిక్ తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ధ్రువతో సూపర్ సక్సెస్ కొట్టిన సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.