
ఈ సంక్రాంతికి రెండు భారీ సినిమాల మధ్యన వచ్చిన శతమానం భవతి సినిమా శర్వానంద్ కెరియర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడమే కాదు రిలీజ్ అయిన మూడు సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతకు ఎక్కువ లాభాన్ని తెచ్చిన సినిమా ఇదని అంటున్నారు. ఖైది 100 కోట్ల షేర్ వాల్యూ రాబట్టినా ప్రీ రిలీజ్ కూడా అదే రేంజ్ లో జరిగింది. కాని శతమానం భవతి అసలు అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన సినిమా.
ఇప్పటికే పాతిక కోట్ల నుండి 30 కోట్ల దాకా ఈ సినిమా కలక్షన్స్ పరుగెడుతున్నాయి. ఒక్క నైజాం లోనే ఈ సినిమా దాదాపు పది కోట్ల కలక్షన్స్ రాబట్టింది. మంచి కుటుంబ కథా చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరధం పడతారు. అదే క్రమంలో సంక్రాంతికి రిలీజ్ అయిన శతమానం భవతికి కూడా మంచి రిజల్ట్ అందించారు. రెండు భారీ సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ముందు దిల్ రాజుని ఓవర్ కాన్ ఫిడెన్స్ అనుకున్నా ఇప్పుడు తన నిర్ణయానికి సలాం చెప్పేస్తున్నారు. శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు.