మెగా చీలిక నిజమే అంటున్నారు..!

మెగాస్టార్ క్రేజ్ తో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అరడజను హీరోలు వచ్చారు. అయితే ఎవరికి వారు మెగా హీరోలమని చెప్పుకుంటూనే స్పేరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం చూస్తున్నారు. ముఖ్యంగా మెగా కాంపౌండ్ లో సూపర్ క్రేజ్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేరు కుంపటి పెట్టేస్తున్నాడని తాజా రూమర్. ఈ న్యూస్ ఎప్పటినుండో వినిపిస్తున్నా ఫ్యాన్స్ లెక్క చేయలేదు. కాని ఖైది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెర్రి, బన్ని వ్యవహారం చూస్తే కచ్చితంగా నమ్మాల్సి వస్తుంది.

మెగా సపోర్ట్ తోనే పైకి వచ్చినా తానే ఇప్పుడు ఓ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ నుండి అల్లు అర్జున్ కు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక ఇప్పుడు చరణ్ కూడా బన్నికి దూరమయ్యాడట. అందుకే అల్లు ఫ్యాన్స్ గా కొత్త పేరు వినిపిస్తుంది. ఇన్నాళ్లు మెగా ఫాలోయింగ్ తో ఉన్న ఈ హీరో తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. మరి అల్లు అర్జున్ తీసుకుంటున్న ఈ డేర్ స్టెప్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.