చరణ్ తో సుకుమార్ మొదలెట్టేశాడు..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఇక తన తర్వాత సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. సుకుమార్ చెర్రి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథ అని తెలుస్తుంది. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ప్రీ లుక్ స్కెచ్ తో పోస్టర్ డిజైన్ చేసిన సుకుమార్ ఆ పోస్టర్ తోనే అంచనాలను పెంచేశాడు. కావడి ఎత్తుకుని వెళ్లే గెటప్ తో హీరో రాం చరణ్ స్కెచ్ కనిపిస్తుంది. మరి చెర్రి లాంటి స్టార్ హీరోని కావడి మోయించిన సుకుమార్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. సుకుమార్ సినిమాలు బాగుంటాయి కాని కమర్షియల్ సక్సెస్ అందుకోలేవు. కాని రాబోతున్న చెర్రి సినిమా కచ్చితంగా సూపర్ సక్సెస్ అవ్వాలని ముందునుండి గట్టి ఎఫర్ట్ పెడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిమ్రిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.