
బుల్లితెర మీద లాస్య చేసిన సందడి అందరికి తెలిసిందే. తన క్యూట్ యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కొద్దిరోజులుగా యాంకరింగ్ కు దూరంగా ఉంటున్న లాస్య సడెన్ గా తన అభిమానులకు షాక్ ఇస్తూ ఈ ఎంగేజ్మెంట్ న్యూస్ బయటపెట్టింది. బుల్లితెర మీద లాస్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదు ఇప్పుడొస్తున్న ప్రోగ్రాంస్ కు లాస్యనే ఓ క్రేజ్ తెచ్చింది.
కొద్దికాలంగా ఆమెకు సరైన ఆఫర్లు రావట్లేదని అన్నారు. మొన్నామధ్య ఆమె కూడా తన మీద వస్తున్న రూమర్స్ గురించి స్పందించి తాను ఎక్కడికి వెళ్లలేదని కొద్ది గ్యాప్ తీసుకున్నానని చెప్పింది. సో మొత్తానికి లాస్య అలా తన సోల్ మెట్ ను ఎంపిక చేసుకుందన్నమాట. పెళ్లిచేసుకున్నా యాంకరింగ్ చేసేందుకు ఏం అభ్యంతరం ఉండదు కాబట్టి తన రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.