
అక్కినేని నాగ చైతన్యకు సౌత్ సూపర్ హీరోయిన్ సమంతకు నిన్న సాయంత్రం నిశ్చితార్ధం జరిగింది. పార్క్ హయత్ లో జరిగిన ఈ ఈవెంట్ పూర్తి కాగానే చెయ్ శామ్, అఖిల్ శ్రీయాలతో పాటుగా నాగ్ అమల కలిసి ఉన్న ఓ పిక్ తో పాటుగా చెయ్ శామ్ ఇప్పుడు అంతా అధికారికమే. మా అమ్మే నాకు కూతురు అయ్యిందని ఐయామ్ వెరీ హ్యాపీ అని ఎమోషనల్ ట్వీట్ చేశాడు నాగార్జున.
ఇక్కడ నాగ్ ప్రస్థావించిన విషయం ఏంటంటే మనం సినిమాలో నాగార్జునకు అమ్మగా నటించిన సమంత తన ఇంటికి పెద్ద కోడలిగా రాబోతుంది. అయితే కోడలిని కూతురు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం నాగ్ లాంటి గొప్ప మనసున్న వాళ్లకే చెల్లింది. నిజంగా ఆ ఇంటికి కోడలు అవుతున్నదుకు సమంత ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. సో మొత్తానికి అలా అక్కినేని ఇంట సమంత అడుగు పెట్టబోతుంది. ఎంగేజ్మెంట్ ఎలాగు పూర్తయింది ఇక పెళ్లి ఎప్పుడు నిర్ణయించారు అన్నది తెలియలేదు.