రామ్ ఓ స్టుపిడ్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హైపర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నారు రెండు మూడు సినిమాలు మొదలు పెట్టే ఆలోచన చేసినా ఎందుకో అవి సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే రామ్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇజం ఫ్లాప్ తర్వాత పూరికి స్టార్ హీరోలెవరు అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఇక కుర్ర హీరోల మీద దృష్టి పెట్టాడు. 

ఇక సినిమా టైటిల్ కూడా స్టుపిడ్ అని పెడుతున్నారట. ఇడియట్, లోఫర్ లాంటి వెరైటీ టైటిల్స్ తో ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసిన పూరి స్టుపిడ్ కూడా అదే తరహాలో పెట్టినట్టు ఉన్నాడు. రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ పూరి చేతిలో పడితే ఎలా ఉంటుందో ఈ స్టుపిడ్ సినిమాతో చూపించబోతున్నారు. సినిమా కోసం అప్పుడే రామ్ వర్క్ అవుట్స్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబందించిన ఎనౌన్స్ మెంట్ వాస్తుందని అంటున్నారు.