ఎన్టీఆర్ మూవీ ఆ రోజు షురూ..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో చేయబోతున్న మూవీ స్టార్టింగ్ మీద కన్ ఫ్యూజన్స్ తొలగిపోయాయి. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తారక్ ఫిబ్రవరి 10న సినిమాకు ముహుర్తం పెట్టాలని ఫిక్స్ చేశారు. అంతేకాదు ఫిబ్రవరి 15 నుండి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట. మొదలు పెట్టడమే సాంగ్ తో షూటింగ్ మొదలు పెడుతున్నారట. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత తారక్ కు కథ వినిపించిన బాబి సినిమా ఫైనల్ చేసుకున్నాడు.


ఇక సినిమాలో జూనియర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తారని తెలిసిందే. టెంపర్ తర్వాత సినిమా కథల విషయంలో న్యూ టర్న్ తీసుకున్న తారక్ బాబి సినిమాతో కూడా హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడని తెలుస్తుంది. సరైన సినిమా పడితే తారక్ స్టామినా ఏంటో జనతా గ్యారేజ్ ప్రూవ్ చేసింది. ఇక అదే రేంజ్ లో ప్రతి సినిమా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి తారక్ పెట్టుకున్న అంచనాలను బాబి ఎంతమేరకు సక్సెస్ చేయగలుగుతాడో చూడాలి. కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ప్రముఖ కథానాయికలను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.