
మంచు ఫ్యామిలీ హీరో విష్ణు ప్రస్తుతం తనకు అచ్చొచ్చిన ఫార్ములా కామెడీ ఎంటర్టైనర్లను తీసుకుంటూ వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఈడోరకం ఆడోరకం తో హిట్ అందుకున్న విష్ణు ఇప్పుడు లక్కున్నోడుగా రాబోతున్నాడు. రాజ్ కిరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హాట్ బ్యూటీ హాన్సిక హీరోయిన్ గా నటించింది. కొద్దిరోజులుగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన విష్ణు లక్కున్నోడు నిన్నటిదాకా ఫిబ్రవరి 3న రిలీజ్ అన్నారు.
అయితే జనవరి 26న రిలీజ్ అవ్వాల్సిన సూర్య సింగం సీరీస్ మూవీ ఎస్-3 పోస్ట్ పోన్ అవడంతో విష్ణు తన సినిమాను ప్రీ పోన్ చేసుకున్నాడు. సో జనవరి 26న విష్ణు లక్కున్నోడుగా తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడన్నమాట. గీతాంజలి లాంటి హర్రర్ కామెడీతో హిట్ అందుకున్న రాజ్ కిరణ్ మంచు విష్ణుతో తీసిన ఈ ఎంటర్టైనర్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. సినిమా అవుట్ పుట్ మీద నమ్మకంగా ఉన్న విష్ణు సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని అంటున్నారు.