కింగ్ 100 ఫస్ట్ గ్లిమ్స్‌ రేపే విడుదల

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరైన నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. రేపు (శనివారం) ‘కింగ్ 100’ ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు కార్తీక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.  

ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా సుష్మిత భట్ చేస్తుండగా, బాలీవుడ్‌ సీనియర్ నటి  టబు, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. 

అన్నపూర్ణా స్టూడియోస్ అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించి నటిస్తున్న ఈ సినిమాకి కథ, దర్శకత్వం: రా. కార్తీక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.