మమితా బైజూ బెత్లహేమ్ కుటుంబ యూనిట్.. సెప్టెంబర్‌ 4న

‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏ.డీ. దర్శకత్వం వహించిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ సినిమా సెప్టెంబర్ 4న తెలుగులో విడుదల కానుంది. ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మమితా బైజు, ఇప్పుడు ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించనున్నారు. 

ఈ సినిమాకు కథ, మాటలు గిరీష్ ఏడీ, కిరణ్ జోసీ అందించగా, విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు. 

భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేస్తోంది.