
‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ, అప్పుడే తన తదుపరి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది
‘రాజ రాజ చోర’ ఫేమ్ హాసిత్ గోలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎస్వీసీ-64 వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెడుతున్న ఈ సినిమాకు ‘దాగుడు మూతలు దండాకోర్.. ఎంటర్టైన్మెంట్ హార్డ్‌కోర్’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్ పెట్టారు.
సాధారణంగా రవితేజ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేనట్లు వరుసపెట్టి సినిమాలు చేస్తుంటారు. కానీ చాలా కాలం తర్వాత ‘ఇరుముడి’ సూపర్ హిట్ అవడంతో అయన కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది రవితేజ మార్క్ కామెడీ సినిమా అని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.