
చంద్రమోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సురభి జంటగా చేస్తున్న కామెడీ సినిమా ‘రంభ, ఊర్వశి, మేనక.’ ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం కామెడీ అద్భుతంగా ఉంది. ట్రైలర్ ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అనిపిస్తుంది. మళ్ళీ చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ పూర్తి స్థాయిలో రంభ, ఊర్వశి, మేనకలతో కామెడీ చేస్తున్నారు.
ఈ సినిమాలో సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, కల్యాణి రాజ్, తారక్ పొన్నప్ప, హరితేజ, గోపరాజు రమణ, గోపరాజు విజయ్, ఆర్.కే.మామ, రచ్చరవి, రవి శివతేజ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: చంద్ర మోహన్ చింతాడ, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, కెమెరా: రామ్ రెడ్డి, డైలాగ్స్: నందు సవిరిగాన చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, ప్రసాద్ నిమ్మకాయల కలిసి నిర్మిస్తున్నఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల కాబోతోంది.