నెట్‌ఫ్లిక్స్‌లో కాక్‌టెయిల్-2

ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు ఇతర భాషల సినిమాలు కూడా చూసే అవకాశం లభిస్తోంది. ఇంగ్లీషుతో సహా ఇతర భాషలు అర్థం చేసుకోలేని వారి కోసం భారతీయ భాషల్లో డబ్బింగ్ చేసి లేదా సంభాషణలు ఆయా భాషల్లో సబ్ టైటిల్స్ వేస్తుండటంతో భాషతో సంబంధం లేకుండా ఇతర భాషా చిత్రాలను ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కనుక ఇప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, నేషనల్, ఇంటర్ నేషనల్ అనే సరిహద్దులు చెరిగిపోయాయి. 

తాజాగా బాలీవుడ్‌ సూపర్ హిట్ సినిమా కాక్‌టెయిల్-2 ఈ నెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. హోమీ అడజానియా దర్శకత్వంలో షాహిద్ కపూర్, రష్మిక మందన, కృతిసనన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా జూన్‌ 19న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ నెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది.