రామ్ చరణ్ సరసన నేషనల్ క్రష్?

రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన ‘పెద్ది’ ఓటీటీకి చేరుకోవడంతో ఇక దాని గురించి చర్చలు పూర్తయినట్లే. ఇప్పుడు మళ్ళీ రామ్‌ చరణ్‌-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆర్సీ-17పై చర్చ మొదలైంది. 

ఇదివరకు వారిద్దరూ కలిసి చేసిన రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అవడం ఒక కారణమైతే, అల్లు అర్జున్‌తో పుష్ప-1,2 చేసి  సుకుమార్ తిరుగులేదనిపించుకోవడం మరో కారణం. కనుక ఆర్సీ-17పై రామ్‌ చరణ్‌ అభిమానులతో పాటు అందరూ ఆసక్తి చూపుతున్నారు. 

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందనను ఎంపిక చేసినట్లు టాక్. పుష్ప-1,2లో ఆమె అద్భుతమైన నటన, ముఖ్యంగా డాన్సింగ్ స్టైల్ చూసిన సుకుమార్ ఆమెను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఆమె కూడా మరోసారి సుకుమార్ వంటి దర్శకుడితో కలిసి రామ్‌ చరణ్‌ వంటి గొప్ప నటుడితో పని చేయడం మంచిదే. అవసరమే. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లోగా ఆర్సీ-17 షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.