స్వయంభూ… ఆగస్టులో వస్తున్నాడట!

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా చేస్తున్న ‘స్వయంభూ’ మొదలుపెట్టి చాలా కాలమే అయ్యింది. షూటింగ్‌ కూడా పూర్తయింది. కానీ గ్రాఫిక్స్ పనులలో ఆలస్యం అవడంతో సినిమా విడుదల చాలా ఆలస్యమైంది.

ఇటీవలే ఆ పనులన్నీ పూర్తవడంతో ఒకటి రెండు రోజుల్లో స్వయంభూ ఫస్ట్ కాపీ దర్శకుడు చేతికి రాబోతోంది. అది రాగానే రిలీజ్‌ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్ట్ నెలలో స్వయంభూ విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో నిఖిల్‌కి హీరోయిన్లుగా నభా నటేష్, సంయుక్త మీనన్ నటించారు. సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.   

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: కెకె సెంథిల్ కుమార్‌,  డైలాగ్స్: విజయ్‌ కామిశెట్టి, స్టంట్స్: కింగ్ సోలమన్, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.  

పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.