రామ్‌ పోతినేని రాపో 23కి సంగీత దర్శకుడు ఫిక్స్

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని తొలిసారిగా దర్శకత్వం చేయబోతున్న సినిమా పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రాపో23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి సామ్‌.సిని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారు.

సామ్‌.సి ఈవిషయం తెలియజేస్తూ రామ్‌ పోతినేనితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  రాపో23 చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేయబోతుండటం చాలా ఆనందంగా ఉంది! రామ్‌ పోతినేని, రాపో సినిమాటిక్స్ వంటి అద్భుతమైన బృందంతో కలిసి ప్రత్యేకమైన సంగీతాన్ని అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక బృందం మొత్తం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని ట్వీట్‌ చేశారు.

రామ్‌ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు.  స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కథ రామ్‌ పోతినేని వ్రాసుకోవడం మరో విశేషం. ఈ సినిమాలో రామ్‌ పోతినేని పాత్ర పేరు ‘వీర.’ ఇది ‘ఒంటరి తోడేలు కథ’ అంటూ ఇచ్చిన టాగ్ లైన్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఈ సినిమాలో రామ్‌ పోతినేనికి జోడీగా శ్రీనిధి శెట్టి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్‌తో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను ప్రకటించనున్నారు.

Happy to be associated with #RAPO23 as the Music Director! 🎶✨

Looking forward to creating something truly special with @ramsayz and the amazing team at @RAPO_Cinematics. Wishing the entire cast and crew a blockbuster journey ahead! 💥#VetaAarambham #RAPO23 pic.twitter.com/tyeR9hUXI2
— 𝐒𝐀𝐌 𝐂 𝐒 (@SamCSmusic) July 7, 2026