
ఓటీటీల పుణ్యమాని నిత్యం అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి కాలక్షేపం అందిస్తున్నాయి. తాజాగా నవదీప్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలలో సిద్దమైన ‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. క్రైమ్ మర్డర్ మిస్టరీ జోనర్‌లో దీనిని తీశారు. ఏప్రిల్ 4 నుంచి జియో హాట్ స్టార్‌లో ‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతోంది.
దీనిలో బబ్లూ పృధ్వీరాజ్, కోమలీ ప్రసాద్, హర్ష వర్ధన్, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, శివా రెడ్డి, ప్రదీప్ రెడ్డి, మహీరెడ్డి, శశిధర్, కొమిది విశ్వేశ్వర, సమీర్, క్రాంతి, సన్విత తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం: రమణ తేజ, స్క్రీన్ ప్లే: చార్వీ మురళి, తెలుగు డైలాగ్స్: వెంకటేష్ నిమ్మలపుది, సంగీతం: మహతి స్వర సాగర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె చేశారు.
ఈ వెబ్ సిరీస్‌ని స్టూడియో డ్రాగన్ కార్పొరేషన్, సీజే ఈఎన్ఎం బ్యానర్లపై నిర్మించారు.