
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా దిల్‌రాజుకి నష్టం కలిగించడంతో, ఆయన కోసం మరో సినిమా చేస్తానని అప్పుడే చెప్పారు. ‘రాజావారూ రాణీవారు’ సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయబోతున్నారు.
ఈ సినిమాని దిల్‌రాజు తన సొంత బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు.
ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రలీజ్ వేడుకలో పాల్గొన్నప్పుడు దిల్‌రాజు నోరుజారి విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా పేరు ‘రౌడీ జనార్ధన్’ అని చెప్పేశారు. ఈ సినిమా, వేణు ఎల్దండి దర్శకత్వంలో తీయబోతున్న ‘ఎల్లమ్మ’ రెండింటి షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతాయని దిల్‌రాజు చెప్పారు.
రౌడీ జనార్ధన్ సినిమా రాయలసీమ రాజకీయాల నేపధ్యంతో తీయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా పేరు రౌడీ జనార్ధన్ అని పెట్టారు కనుక విజయ్ దేవరకొండ రౌడీగా నటిస్తున్నట్లు అర్దమవుతోంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోరే హీరోయిన్గా నటిస్తోంది. రుక్మిణీ వసంత్, కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల అవినాష్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్లోనే ప్రకటించారు.