సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి జంటగా చేసిన ‘మనమే’ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలీదు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అన్నట్లు తీసిన ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీలో ప్రసారం కాబోతోంది. శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి హెషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం చాలా స్పెషల్. ప్రేక్షకులకు సినిమా గుర్తులేకపోయినా దాని సంగీతం, పాటలు గుర్తుండిపోతాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ రామస్వామి కూచిభొట్ల కలిసి ఈ సినిమా నిర్మించారు.